: బిల్లు చర్చపై ఇంతవరకు ఎలాంటి క్లారిటీ లేదు: సీఎం కిరణ్
ఇలాంటి సున్నితమైన బిల్లును తానెప్పుడూ చూడలేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. సభలో బిల్లుపై చర్చ ఏవిధంగా జరగాలనే దానిపై ఇంతవరకు ఎలాంటి క్లారిటీ రాలేదని స్పష్టంచేశారు. శాసన మండలిలో ఈ రోజు ఆయన ప్రసంగించారు. రాజ్యాంగం, నిబంధనలు, సాంప్రదాయాలకు లోబడే చర్చను జరుపుకోవాలని అభిప్రాయపడ్డారు. విభజన అంశం చాలా సున్నితమైంది కాబట్టి... ఇరు ప్రాంత ఎమ్మెల్యేలు జాగ్రత్తగా మాట్లాడుకుంటే ఎలాంటి ఇబ్బందులు రావని కిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా బీహార్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏం జరిగిందన్న విషయాన్ని క్లుప్తంగా తెలియజేశారు. మనం బిల్లు ముసాయిదాపై చర్చించే ముందు ఇతర రాష్ట్రాల విభజన సమయంలో ఏం జరిగిందో, పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయాలని సూచించారు.