: పర్యాటక అవార్డులు ప్రకటించిన చిరంజీవి... ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్!


పర్యాటక శాఖ అవార్డులను కేంద్ర మంత్రి చిరంజీవి ఢిల్లీలో ఈరోజు ప్రకటించారు. మొత్తం 36 కేటగిరీల్లో 86 ఉత్తమ అవార్డులను ఎంపిక చేశారు. ఇందులో..  ఉత్తమ సాముదాయక పర్యాటక రాష్ట్ర అవార్డును మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ దక్కించుకుంది. రెండో స్థానంలో రాజస్థాన్, మూడో స్థానంలో గుజరాత్ ఉన్నాయి. ఉత్తమ పౌర సేవల సంస్థ అవార్డుకు జీహెచ్ఎంసీ ఎంపికైంది.

ఇక ఉత్తమ అంతర్జాతీయ విమానాశ్రాయాలుగా
 శంషాబాద్ ఎయిర్ పోర్టు, విశాఖ విమానాశ్రయం, ఉత్తమ వారసత్వ నగరంగా వరంగల్, మెడికల్ విభాగంలో సేవలందించినందుకు గానూ ఉత్తమ ఆస్పత్రిగా హైదరాబాద్ అపోలో, ఉత్తమ పర్యాటక సంస్థగా ఏపీటీడీసీ, ఉత్తమ సమ్మేళనా కేంద్రంగా హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ అవార్డులు దక్కించుకున్నాయి.

కాగా,
'లైఫ్ ఆఫ్ పై' సినిమా, పుస్తకానికి ప్రత్యేక జాతీయ పర్యాటక జ్యూరీ అవార్డు ప్రకటించారు. అనంతరం మాట్లాడిన చిరంజీవి.. ఏప్రిల్ 12 నుంచి 14 వరకూ హైదరాబాదులో ప్రపంచ పర్యాటక సదస్సును నిర్వహించనున్నట్లు తెలి పారు. అసలు ఈ సదస్సును అడ్డుకునేందుకే నగరంలో బాంబు పేలుళ్లు జరిగాయన్నారు. అయితే, ఎలాంటి ఆందోళనలు, దాడులు పర్యాటక సదస్సు ను ఆపలేవని చిరు ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News