: రాష్ట్రపతిని కలుస్తాం.. బిల్లులోని తప్పులను ఎత్తి చూపుతాం: గాలి ముద్దుకృష్ణమ


ముసాయిదా బిల్లు మొత్తం అసమగ్రంగా, అస్పష్టంగా ఉందని టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ తెలిపారు. ముసాయిదా బిల్లుపై ఫిర్యాదు చేయడానికి రాష్ట్రపతిని కలుస్తామని చెప్పారు. అలాగే, తప్పుల తడకగా ఉన్న బిల్లును ఢిల్లీకి తిప్పి పంపించాలని స్పీకర్ ను కోరతామని తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి ఈ రోజు ఆయన మాట్లాడారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ముణగాల, భద్రాచలం ప్రాంతాలను ఎందుకు కోరుకుంటున్నారని తెలంగాణ వాదులను ప్రశ్నించారు. ప్రస్తుత రాష్ట్ర విభజనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా కారణమని విమర్శించారు. నిజాం పరిపాలించిన జిల్లాల్లో ప్రస్తుతం 5 జిల్లాలు మహారాష్ట్రలో, 3 జిల్లాలు కర్ణాటకలో ఉన్నాయని... ఆ జిల్లాల గురించి ఎందుకు అడగడం లేదని టీ.వాదులను సూటిగా ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News