: పార్టీ పతనానికి అధిష్ఠానమే కారణం: డీఎల్ రవీంద్రారెడ్డి


రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు చేరుకుందని... దీనికి కారణం కాంగ్రెస్ అధిష్ఠానమేనని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఆరోపించారు. అయితే, కేవలం ఒక తప్పు జరిగినంత మాత్రాన సోనియాగాంధీని తప్పుకోవాలని డిమాండ్ చేయడం సరికాదని సూచించారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి త్వరలోనే ఓ ప్రాంతీయ పార్టీని పెడతారంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయని... కానీ ఆయన ఏ పార్టీ పెట్టరని అన్నారు. గాదె వెంకటరెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి లాంటి నేతలు కిరణ్ కొత్త పార్టీపై పూర్తి ఆశాభావంతో ఉన్నారని విమర్శించారు. కడపలో ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి ఆజాద్ కు లేఖ రాశానని తెలిపారు

  • Loading...

More Telugu News