: స్వలింగ సంపర్కంపై సుప్రీంలో కేంద్రం రివ్యూ పిటిషన్?
స్వలింగ సంపర్కం నేరమేనంటూ సుప్రీంకోర్టు ఈ నెల 11న ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయనుంది. ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం స్వలింగ సంపర్కానికి పాల్పడితే జీవిత ఖైదు కూడా విధించడానికి వీలుంది. సుప్రీం తీర్పుపై గే సమాజం, హక్కుల సంఘాల నుంచి వ్యతిరేకత రావడం, కేంద్రం కూడా వారి పట్ల సానుకూలంగా ఉండడం వల్ల సుప్రీం తీర్పును పున: పరిశీలించాలని కోరుతూ రివ్యూ పిటిషన్ వేయనుంది. దీనిపై ఇప్పటికే న్యాయశాఖ అటార్నీ జనరల్ (ప్రభుత్వానికి న్యాయ వ్యవహరాల్లో మార్గదర్శకుడు) అభిప్రాయాన్ని కోరింది.