: ఎవరినీ నిందించాల్సిన పని లేదు: సుజన్నే
తాను, తన భర్త హృతిక్ రోషన్ విడిపోవడంపై ఎవరినీ నిందించాల్సిన పని లేదని సుజన్నే స్పష్టం చేసింది. విడిపోవాలని వీరు ఇటీవలే నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఇందుకు ఎవరూ కారణం కాదన్నారు. వీరి రిలేషన్ బ్రేక్ అవడానికి అర్జున్ రాంపాల్ కారణమనే వదంతులు గుప్పుమన్న నేపథ్యంలో సుజన్నే ఇలా స్పందించారు. ఒక తల్లిగా, ఒక మంచి వ్యక్తిగా ఇలాంటి వార్తలపై మాట్లాడనని సుజన్నే చెప్పారు. అర్జున్ మంచి స్నేహితుడన్నారు. తాను, హృతిక్ విడిపోవడానికి కారణం ఏమీ లేదని, ఒక్కోసారి పరిస్థితులు అలా ఎదురవుతాయంటూ వేదాంత ధోరణిలో మాట్లాడారు. ముంబైలో ఒక స్టోర్ ప్రారంభం సందర్భంగా ఆమె తన అభిప్రాయాలను ఇలా పంచుకున్నారు. అర్జున్ రాంపాల్ కూడా తనపై వస్తున్న కథనాలను తప్పుబట్టిన విషయం తెలిసిందే.