: కాత్యాయని విద్మహేకు అత్యున్నత సాహితీ పురస్కారం


సాహిత్య విమర్శకురాలు, కాకతీయ వర్సిటీ తెలుగు విభాగం సీనియర్ ప్రొఫెసర్ కాత్యాయని విద్మహేకు ఈ ఏడాదికి గాను ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆమె రచించిన సాహిత్యాకాశంలో సగం వ్యాస సంకలనానికి గాను ఇది దక్కింది. 28 వ్యాసాలు ఉండే ఈ సంకలనం 2010లో విడుదలైంది. స్త్రీవాద రచయితగా, విమర్శకురాలిగా, విశ్లేషకురాలిగా కాత్యాయనికి మంచి పేరు ఉంది.

రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలలో తెలుగు పాఠ్యాంశాల రచయితగా కూడా ఆమె సేవలు అందిస్తున్నారు. కాత్యాయని స్వస్థలం ప్రకాశం జిల్లా మైలవరం. పుట్టింది మైలవరంలోనే అయినా పీహెచ్ డీ వరకూ ఆమె విద్యాభ్యాసం అంతా వరంగల్ లోనే కొనసాగింది. కాత్యాయనితోపాటు 22 భాషలకు చెందిన రచయితలకు ఈ ఏడాది సాహిత్య అకాడమీ పురస్కారాలు లభించాయి. బాలీవుడ్ పాటల రచయిత జావేద్ అక్తర్ కూడా వీరిలో ఉన్నారు.

  • Loading...

More Telugu News