: వయసుతోబాటు బీపీ పెరిగినా ఫరవాలేదట


వయసు పెరిగే కొద్దీ రకరకాల జబ్బులు మేమున్నామంటూ బయటపడతాయి. అలాంటి వాటిలో అందరిలోనూ కామన్‌గా కనిపించే జబ్బు బీపీ. ఈ బీపీ మామూలుగా అయితే 120/80గా సూచిస్తారు. కానీ వయసు పైబడినవారికి కాస్త పెరిగినా ఫరవాలేదని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా అరవై ఏళ్లు పైబడిన వారికి రక్తపోటు 150/90 కూడా ఉండవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

వయసు పెరిగిన వారిలో సాధారణంగా రక్తపోటు 140/90 అనేది కొలమానంగా ఉంటోంది. అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పానెల్‌ దీనికి సంబంధించి నిర్వహించిన పరిశోధనా వివరాలను వెల్లడిస్తూ హై బీపీ అనేది 150/90గా కూడా ఉండవచ్చని తెలిపింది. అంటే హైబీపీ ప్రారంభ దశలో ఉన్నవారికి ప్రభావవంతమైన చికిత్స అవసరం లేదని, అలాంటి వారికి అంత ప్రభావవంతమైన చికిత్స చేయడం మంచిది కాదని పేర్కొంది. అలాగే బీపీ 150 దాటిన వారికి మాత్రమే బీపీ మాత్రలను వాడాలని పానెల్‌ సూచిస్తోంది.

  • Loading...

More Telugu News