: మన బ్రిడ్జిలలో ఇది చాలా పొడవైనది
మన దేశంలోని వంతెనల్లో చాలా పొడవుగా ఉండేలా ఒక వంతెనను నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలోనే అతిపెద్దదైన రైలు మరియు రోడ్డు వంతెనగా నిలుస్తుంది. అసోంలోని దిబ్రూగఢ్ జిల్లాలో నిర్మిస్తున్న ఈ వంతెనపేరు బోగీబీల్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జి పై భాగంలో మూడు లేన్ల రహదారి, కింది భాగంలో రెండు రైల్వే లైన్లు ఉంటాయి.
అసోంలోని బ్రహ్మపుత్ర నదిమీద 2002లో ప్రారంభించిన ఈ వంతెన నిర్మాణం 2017 నాటికి పూర్తవుతుందని అంచనా. దీని పొడవు 4.94 కిలోమీటర్లు. అరుణాచల్ ప్రదేశ్‌లోని సైనికులకు నిత్యావసర వస్తువులను, సరుకులను చేరవేయడంలో ఇది బాగా ఉపయోగపడనుంది. దీని నిర్మాణ వ్యయం రూ.1767 కోట్లుగా అంచనా. అయితే దీన్ని పూర్తి చేసే సమయానికి ఈ నిర్మాణ వ్యయం రూ.4000 కోట్లు కాగలదని పరిశీలకులు భావిస్తున్నారు.