: అమెరికా అవమానించిన దేవయాని ఐక్యరాజ్య సమితికి బదిలీ


అమెరికాలో అత్యంత అవమానకరంగా అరెస్టయి విడుదలైన దేవయాని కోర్బగాడేను భారత విదేశాంగ శాఖ బదిలీ చేసింది. ఆమెను న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి శాశ్వత రాయబార కార్యాలయానికి బదిలీ చేశారు. దీంతో ఆమెకు వియన్నా ఒప్పందం అనుసరించి దౌత్యవేత్తలకు వుండే అన్నిరకాల భద్రత ఉంటుంది. ఆమెరికాలోని భారత దౌత్య కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఆమెను పనిమనిషి ఫిర్యాదు కారణంగా అరెస్టు చేయడంతో భారత్ తీవ్రంగా స్పందించింది. అమెను విడుదల చేసిన సందర్భంగా దౌత్యవేత్తలకు లభించే రక్షణ ఉండదని అమెరికా స్పష్టం చేసింది. దీంతో భారత్ ఆమెను అమెరికాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయానికి బదిలీ చేసింది.

  • Loading...

More Telugu News