: గాడిద పాలకు మహా గిరాకీ.. లీటర్ ఐదు వేలు!


గంగి గోవు పాలు గరిటడైన చాలు.. కడివడైననేమి ఖరము పాలు... అంటూ వేమన గాడిద పాలను తీసి పారేసినా, ఇప్పుడవే మహాతీర్థంలా జుర్రేస్తున్నారు విశాఖ, కృష్ణా జిల్లాల వాసులు. పైపెచ్చు, 'గుక్కెడైన చాలు ఖరము పాలు' అంటూ కితాబు కూడా ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం గాడిద పాలకు విశాఖ జిల్లా తగరపువలస, భీమిలి పరిసర ప్రాంతాల్లో భలే గిరాకీ పెరిగింది. గాడిద పాలు తాగితే అస్తమా, నెమ్ము, ఆయాసం, దగ్గు వంటి రోగాలు దరికి చేరవన్న నమ్మకం ఎలా వ్యాప్తి చెందిందో తెలియదు కానీ, చుట్టుపక్కల పల్లెల్లో బాగానే వ్యాపించింది.

తగరపువలస, భీమిలికి రెండు కొండలు దగ్గరగా ఉండడంతో చలి విపరీతంగా వుంటుంది. దీంతో జలుబు, దగ్గు, ఉబ్బసం విజృంభిస్తున్నాయి. అలాంటి వారికి గాడిదపాలు ఔషధంలా పనిచేస్తాయనే నమ్మకంతో గాడిదపాలను కొని వాడుతున్నారు. దీంతో గాడిద పాలకు ఎక్కడలేని గిరాకీ వచ్చిపడింది. మిల్లీలీటర్ల పాలే వందల రూపాయలు పలుకుతున్నాయి. గాడిద పాలంటే చాలు స్థానికులు క్యూలు కడుతున్నారు. కొంత మంది గాడిదలను వెంటబెట్టుకుని వచ్చి ఇళ్లదగ్గర పితికి మరీ ఇస్తున్నారు. లీటర్ పాల ధర ఐదు వేల రూపాయల వరకు పలుకుతుండడం విశేషం. విజయవాడలో కూడా కొన్ని చోట్ల ఇదే సంప్రదాయం ఉండగా.. గాడిద మాంసానికి కూడా మంచి గిరాకీ ఏర్పడింది.

  • Loading...

More Telugu News