: మంత్రుల నివాస ప్రాంగణం ఎదుట కాంట్రాక్ట్ లెక్చరర్ల ఆందోళన
గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు ఈ మధ్యాహ్నం మంత్రుల నివాస ప్రాంగణం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ పదమూడేళ్లుగా కాంట్రాక్టు లెక్చరర్లుగా పని చేస్తున్నా కూడా ఇంకా వీరికి ఉద్యోగాలు క్రమబద్ధీకరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వీరి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. వీరి ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని గిరిజన శాఖ అధికారులు చేసిన సిఫార్సును కూడా ఆ శాఖ మంత్రి బాలరాజు పట్టించుకోవడం లేదని కృష్ణయ్య ఆరోపించారు.