: మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 113 పరుగుల వద్ద ఛటేశ్వర్ పూజారా(25) రనౌట్ గా వెనుదిరిగాడు. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి ఇక్కట్లలో పడ్డ భారత జట్టును కోహ్లీ(81)తో కలిసి పూజారా ఆదుకున్నాడు. ఇద్దరూ క్రీజులో నిలదొక్కుకుంటున్న దశలో పుజారా సమన్వయలోపంతో రనౌట్ అయ్యాడు. ప్రస్తుతానికి కోహ్లీకి జతగా రోహిత్ శర్మ(14) ఆడుతున్నాడు. మూడు వికెట్ల నష్టానికి టీమిండియా 149 పరుగులు చేసింది.