: విదేశాలకు వెళ్లేందుకు నిమ్మగడ్డకు కోర్టు గ్రీన్ సిగ్నల్
విదేశాలకు వెళ్లేందుకు నిమ్మగడ్డ ప్రసాద్ కు నాంపల్లి సీబీఐ న్యాయస్థానం అనుమతినిచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసులో ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ నిందితుడుగా ఉన్న విషయం విదితమే. కేసు విచారణలో రిమాండ్ ఖైదీగా వున్న ఆయనకు ఇంతకు మునుపే సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా విదేశాలకు వెళ్లేందుకు అనుమతి లభించడంతో నిమ్మగడ్డకు ఊరట లభించినట్లయింది.