: యూట్యూబ్ లో 5 లక్షల మంది వీక్షించిన సినిమా!
హిందీలో అత్యంత ప్రజాదరణ పొందిన సినిమా.. యూట్యూబ్ లో అత్యధికులు చూసిన సినిమా.. గూగుల్ లో ఈ ఏడాది ఎక్కువగా సెర్చ్ చేసిన సినిమా ఏది? అనే అన్ని ప్రశ్నలకు ప్రేక్షకులు ఒకటే సమాధానం ఇచ్చారు. అదే ఆషికీ-2. ఈ సినిమా కోసం గూగుల్ లో దాదాపు 5 లక్షల మంది వివిధ రకాలుగా వెతికారు. ఇందులో ప్రధానంగా 'అప్ నే కరమ్ కీ కర్ అదాయే' పాట కోసం ఇప్పటికీ గూగుల్ నే అభిమానులు ఆశ్రయిస్తున్నారు.
వీక్షకుల సంఖ్యను ఆధారం చేసుకుని గూగుల్ ఈ ఏటి మేటి చిత్రంగా ఈ సినిమాను నిర్ధారించింది. దీని తరువాతి స్థానాల్లో చెన్నై ఎక్స్ ప్రెస్, క్రిష్ 3, ధూమ్ 3, హిమ్మత్ వాలా, రేస్ 2, ఏబీసీడీ, భాగ్ మిల్కా భాగ్, దబాంగ్ 2, మద్రాస్ కేఫ్ లు నిలిచాయి. కాగా ఆషికీ 2 సినిమాలో ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధ కపూర్ లు నటించగా, మోహిత్ సూరి దర్శకత్వం వహించారు. భూషణ్ కుమార్, మహేష్ భట్ లు ఈ సినిమాను నిర్మించారు.