: ఐటీ మహిళా ఉద్యోగుల భద్రతకు మరిన్ని చర్యలు: డీజీపీ ప్రసాదరావు
ఐటీ మహిళా ఉద్యోగుల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని డీజీపీ ప్రసాదరావు అన్నారు. హైటెక్ సిటీ పరిధిలోని మాదాపూర్ లో జరిగిన ‘మహిళా ఐటీ ఉద్యోగుల చైతన్య సదస్సు’కు డీజీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైటెక్ సిటీలో గస్తీ కోసం ఐదు కొత్త వాహనాలను ఈ రోజు ఆయన ప్రారంభించారు. కారిడార్ లోని ఐటీ సంస్థల సహకారంతో మహిళలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లను రూపొందించామని.. అందుకోసం మరో వంద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.