: రాజమండ్రిలో హోరెత్తిన 'సమైక్యాంధ్ర విద్యార్థి గర్జన'
సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యమం మరోసారి ఊపందుకుంటోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కంబాలచెరువు వద్ద 'సమైక్యాంధ్ర విద్యార్థి గర్జన' కార్యక్రమాన్ని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నిర్వహించింది. సమైక్య గర్జన సందర్భంగా పట్టణంలోని వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా జై సమైక్యాంధ్ర నినాదాలతో రాజమండ్రిని హోరెత్తించిన విద్యార్థులు, ర్యాలీ, మానవహారం చేపట్టారు.