: జెస్సకాలాల్ హత్య కేసులో మనూశర్మకు పెరోల్


1999లో మోడల్ జెస్సకాలాల్ ను హత్య చేసిన కేసులో మనూశర్మ జీవిత ఖైదు అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఢిల్లీ హైకోర్టు మనూశర్మకు పెరోల్ మంజూరు చేసింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పరీక్షలు రాయడానికి పెరోల్ మంజూరు చేయాలంటూ శర్మ పెట్టుకున్న పిటిషన్ ను విచారించిన ఢిల్లీ హైకోర్టు... అతనికి డిసెంబరు 28 నుంచి జనవరి 5వ తేదీ వరకు మొత్తం తొమ్మిది రోజుల పాటు పెరోల్ ను మంజూరు చేసింది. అంతే కాకుండా శర్మ పరీక్షా కేంద్రాన్ని చండీఘడ్ నుంచి ఢిల్లీకి మార్చాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. జైల్లో మనూశర్మ ప్రవర్తన బాగుందని జైలు అధికారులు తెలపడంతో, కోర్టు శర్మకు పెరోల్ మంజూరు చేసింది.

  • Loading...

More Telugu News