: మొత్తానికి బిల్లు రాకుండా అడ్డుకున్నాం: సబ్బం హరి


ఏదో ఒకటి చేసి తెలంగాణ ముసాయిదా బిల్లు శీతాకాల సమావేశాల్లో పార్లమెంటుకు రాకుండా అడ్డుకున్నామని ఎంపీ సబ్బం హరి తెలిపారు. లోక్ సభ వాయిదా అనంతరం మాట్లాడుతూ, కాంగ్రెస్ తన మార్కు రాజకీయాలతో సభను వాయిదా వేసిందని మండిపడ్డారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తాము ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ పట్టించుకోలేదని... సభలో తమ అనుకూల ఎంపీలు 70 మంది ఉన్నారని, అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఉందని చెప్పారు. అవిశ్వాస తీర్మానంపై చర్చించాల్సి వస్తుందన్న భయంతో తెలంగాణ ఎంపీలను ఉసిగొల్పి పోడియంలో నినాదాలు చేయించిందని విమర్శించారు. తాము ప్రజల్లోకి వెళ్లి నిజానిజాలు వివరిస్తామని, ప్రజల ముందు కేంద్రం వైఖరిని ఎండగడతామని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News