: సమాచారం ఇస్తేనే సభ జరుగుతుంది: పయ్యావుల


తెలంగాణ ముసాయిదా బిల్లు చర్చ కంటే ముందు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆస్తులు, అప్పులు, పెట్టుబడులు వంటి అన్ని లెక్కలు తెలపాలని... ఆ తరువాతే చర్చ చేపట్టాలని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ శాసనసభకు ఏదైనా బిల్లు పంపేముందు దాని పూర్వాపరాలు, బిల్లుకున్నటువంటి లక్షణాలు తెలపాలి. కానీ... తెలంగాణ బిల్లు విషయంలో ఇవేవీ లేకుండా ఖాళీ పేపర్ మాత్రమే పంపారని విమర్శించారు. దీనిపై స్పీకర్ కు లేఖ అందజేసినట్టు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News