: సమ్మెతో మూతబడిన బ్యాంకులు... కొన్ని ఏటీఎంలలో క్యాష్ ఖాళీ
దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు ఇవాళ సమ్మె చేస్తున్న విషయం విదితమే. సమ్మె ప్రభావంతో హైదరాబాదులో కూడా బ్యాంకులు మూతబడ్డాయి. నగదు లావాదేవీలు పూర్తిగా నిలిచిపోవడంతో బ్యాంక్ వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో, అత్యవసరంగా నగదు తీసుకోవడానికి ఖాతాదారులు ఏటీఎంలను ఆశ్రయించడంతో నగరంలోని కొన్ని ఏటీఎం సెంటర్లలో మధ్యాహ్నానికే క్యాష్ ఖాళీ అయిపోయింది. ఏటీఎంలలో నగదు నింపే ప్రైవేట్ ఏజెన్సీలు సమ్మెను పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. సమ్మె విషయం పక్షం రోజుల ముందే ప్రకటించినా... బ్యాంక్ ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోలేదని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.