: 35 మంది అమెరికా నౌకాసిబ్బందికి బెయిల్ తిరస్కరించిన మద్రాస్ హైకోర్టు


అమెరికా నౌక 'ఎంవీ సీమెన్ గార్డ్ ఓహియో' సిబ్బంది 35 మందికి ఈ రోజు మద్రాస్ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. గత అక్టోబరులో చట్ట విరుద్ధంగా భారత సముద్ర జలాల్లో మకాం వేయడమే కాకుండా, ఆయుధాలను తరలిస్తుండటంతో కోస్టల్ సెక్యూరిటీ గ్రూప్ వీరందరినీ అరెస్ట్ చేసింది. 35 మంది సిబ్బందిలో 13 మంది భారతీయులు సహా యూకే, ఎస్టోనియా, ఉక్రెయిన్ జాతీయులున్నారు. నౌక అమెరికన్ కంపెనీకి చెందినదైనప్పటికీ, నౌకాసిబ్బందిలో ఒక్క అమెరికన్ కూడా లేడు. నౌకాసిబ్బందికి సరుకులు సప్లై చేశాడనే ఆరోపణలు ఎదుర్కొన్న ఒక తమిళ జాలరికి మాత్రం కోర్టు బెయిలు మంజూరు చేసింది. వీరిని అరెస్ట్ చేసిన సమయంలో వీరి వద్ద నుంచి 31 అత్యాధునిక ఆయుధాలు, 5 వేల రౌండ్ల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News