: జై సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తిన లోక్ సభ
ఈ ఉదయం ప్రారంభమైన లోక్ సభ జై సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తింది. లోక్ పాల్ బిల్లుపై చర్చ సందర్భంగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీల ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. లోక్ పాల్ బిల్లుపై బీజేపీ నేత సుష్మాస్వరాజ్ మాట్లాడుతున్నప్పుడు పెద్దపెట్టున నినాదాలు చేయడంతో ... కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలే యూపీఏపై అవిశ్వాసతీర్మానం పెట్టడం విశేషమని ఆమె ఎద్దేవా చేశారు. అనంతరం సభలో లోక్ పాల్ పై చర్చ జరిపి బిల్లును ఆమోదించారు.