: అందరూ బిల్లు బిల్లు అంటున్నారే కానీ నష్టాలు గుర్తించడం లేదు: ములాయం
ప్రస్తుతం తెస్తున్న లోక్ పాల్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు తెగ తాపత్రయపడుతున్నాయని... కానీ దీని వల్ల జరిగే నష్టాలను మాత్రం గుర్తించడం లేదని ఎస్పీ అధినేత ములాయం సింగ్ అన్నారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం తెస్తున్న బిల్లు ప్రమాదకరంగా ఉందని అన్నారు. బిల్లు కారణంగా ప్రభుత్వోద్యోగులు విధులు నిర్వర్తించలేరని, ఒక్క దస్త్రం కూడా కదిలే పరిస్థితి ఉండదని అన్నారు. లోక్ పాల్ బిల్లు కారణంగా ప్రభుత్వ పథకాలు, సేవలు అన్నీ నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. కేవలం సోనియా ప్రాపకం కోసం పాకులాడుతూ అందరూ బిల్లు బిల్లు అంటున్నారే కానీ... వాస్తవాలను గుర్తించలేకపోతున్నారని మండిపడ్డారు.