: ముఖ్యమంత్రికి, సభాపతికి వైఎస్ విజయమ్మ లేఖ


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సభాపతి నాదెండ్ల మనోహర్ కు ఇవాళ వైఎస్ విజయలక్ష్మి లేఖలు రాశారు. శాసన సభలో ప్రవేశపెట్టిన తెలంగాణ ముసాయిదా బిల్లు స్పష్టంగా లేదని, తెలుగు అనువాదంలో తప్పులు దొర్లాయని ఆమె లేఖలో పేర్కొన్నారు. స్పష్టంగా లేని బిల్లుపై సభలో ఎలా చర్చిస్తారని విజయమ్మ ప్రశ్నించారు. బిల్లులోని అక్షర దోషాలను సవరించిన తరువాతనే చర్చ జరపాలని ఆమె శాసన సభాపతిని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News