: విద్యుత్ కోతలు, సర్ ఛార్జీల పెంపుపై బీజేపీ ఆందోళన
విద్యుత్ కోతలు, సర్ ఛార్జీల పెంపుపై బీజేపీ ధ్వజమెత్తింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, దత్తాత్రేయ, లక్ష్మణ్, పార్టీ కార్యకర్తలతో కలిసి హైదరాబాదు లోని విద్యుత్ సౌధను ముట్టడించేందుకు యత్నించారు. విద్యుత్ సౌధలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పార్టీ నేతలు, సామాన్య ప్రజలపై మోయలేని భారం వేశారని ఆరోపించారు. ఫలితంగా రైతులు, విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. సర్ ఛార్జీలను వెనక్కి తీసుకోవాలని డిమాండు చేస్తూ.. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.