: జనవరి 23 వరకూ సభ జరగదు: హరీశ్ రావు
జనవరి 23 వరకూ శాసనసభ సమావేశాలు జరుగుతాయన్న ప్రచారంలో నిజం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కార్యాలయం కావాలనే లీకులు ఇస్తోందని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద హరీశ్ రావు ఈ రోజు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ బిల్లుపై చర్చ సందర్భంగా అన్ని ప్రాంతాలవారు తమ అభిప్రాయాలు చెప్పుకోవచ్చని, అడ్డుకునే సభ్యులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.