: లోక్ సభలో వ్యూహం మార్చుకున్న టీడీపీ
లోక్ సభలో టీడీపీ తన వ్యూహాన్ని మార్చుకుంది. ఈ రోజు కేవలం వాయిదా తీర్మానాన్ని మాత్రమే ఇవ్వాలనుకున్న టీడీపీ సీమాంధ్ర ఎంపీలు... ఊహించని విధంగా అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. ఈ రోజు లోక్ సభలో లోక్ పాల్ బిల్లుపై చర్చ ఉన్న నేపథ్యంలో, బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటించిన టీడీపీ... సభ సజావుగా సాగేందుకు సహకరించాలని తొలుత నిర్ణయించింది. అయితే హఠాత్తుగా టీడీపీ తన ఎత్తుగడను మార్చింది. దీనికి తోడు, సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు కూడా యూపీఏపై అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చారు.