: జనవరి 23 వరకు సమావేశాలు జరిగితే ఇబ్బందే: జానారెడ్డితో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు


రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జనవరి 23 వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఇబ్బందే అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జానా రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. అయితే, జనవరి 23 వరకు సభ జరిగినా విభజన ప్రక్రియ ఆగిపోయే అవకాశం లేదని జానారెడ్డి వారికి నచ్చజెప్పారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులందరూ తమ అభిప్రాయాలను లిఖిత పూర్వకంగా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని టీఆర్ఎస్ నేతలకు జానా తెలిపారు.

  • Loading...

More Telugu News