: తెలంగాణ బిల్లుపై చర్చకు సహకరించాలి: జూలకంటి రంగారెడ్డి
తెలంగాణ బిల్లుపై చర్చించేందుకు సభ్యులందరూ సహకరించాలని సీపీఎం శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి కోరారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ, ప్రజాసమస్యలపై చర్చించకుండా సభను అడ్డుకోవటం తగదని హితవు పలికారు. అవసరమైతే శాసనసభ సమావేశాలను పొడిగించైనా ప్రజా సమస్యలపై చర్చించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.