: నేడే భారత్, దక్షిణాఫ్రికా తొలి టెస్ట్


ఈ రోజు భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జొహానెస్ బర్గ్ లో తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. సఫారీ బౌన్సీ పిచ్ లపై వన్డేలలో ఉక్కిరిబిక్కిరైన భారత్ కు... ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ లలో అసలుసిసలైన పరీక్ష ఎదురుకానుంది. టెండూల్కర్ నిష్క్రమణ తర్వాత టీం ఇండియా ఆడుతున్న తొలి టెస్టు ఇదే. దీంతో అందరి దృష్టి ఈ మ్యాచ్ పై నిలిచింది. ఇంతకాలం భారత జట్టుకు మిడిల్ ఆర్డర్ లో వెన్నెముకలా నిలిచిన సచిన్ లేని లోటును, మన టీం ఎలా అధిగమిస్తుందో అని ఆందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్ ను టెన్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.

  • Loading...

More Telugu News