: పరీక్షే కానీ రాటుదేలేందుకు ఇదే మంచి తరుణం: ధోనీ


క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ లేకుండా తొలిసారి తాము టెస్టు సిరీస్ ను ఆడనున్నామని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపారు. సౌతాఫ్రికాలో టెస్ట్ సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో జోహెన్నెస్ బర్గ్ లో ఆయన మాట్లాడుతూ 1996 తరువాత టెస్టు క్రికెట్ లో సచిన్, గంగూలీ, ద్రవిడ్ తదితర ఉద్దండులెవరూ లేకుండా తొలిసారి బరిలోకి దిగుతున్నామని అన్నారు.

సచిన్ లేకుండా అద్భుత ఫాంలో ఉన్న సఫారీలను యువభారత్ ఢీ కొనబోతోందని ధోనీ అన్నారు. విజయం కోసం యువ భారత జట్టు తీవ్రంగా శ్రమిస్తోందని ఆయన అన్నారు. భారత బ్యాట్స్ మెన్ కు ఇది నిజంగా పరీక్షేనని.. అయితే రాటుదేలేందుకు ఇంతకు మించిన అవకాశం రాదని కూడా ధోనీ చెప్పారు. ఈసారి అభిమానులకు సరికొత్త బ్యాటింగ్ విన్యాసాన్ని వీక్షించే అవకాశం కలుగనుందని ధోని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News