: లోక్ పాల్ వల్ల సీబీఐ, ఏసీబీలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయి: కపిల్ సిబాల్
లోక్ పాల్ బిల్లు కారణంగా సీబీఐ, ఏసీబీ వంటి సంస్థలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్ సిబాల్ తెలిపారు. లోక్ పాల్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన తరువాత ఆయన మాట్లాడుతూ బిల్లు ఆమోదం పొందడానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాయని ఆయన అన్నారు. మరో కేంద్ర మంత్రి కమల్ నాథ్ బిల్లు ఆమోదానికి సహకరించిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు అన్నారు. రేపు లోక్ సభలో కూడా బిల్లు ఆమోదం పొందుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.