: సీఎం కిరణ్ క్యాంప్ కార్యాలయంలో సీమాంధ్ర మంత్రుల భేటీ
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సీమాంధ్ర ప్రాంత మంత్రులు సమావేశమయ్యారు. ఈ భేటీకి సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు. బుధవారం శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా వీరు సమాలోచనలు జరుపుతున్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లు చర్చకు సంబంధించి ప్రతి నిబంధన మీదా ఓటింగుకి పట్టుబట్టాలని వీరు నిర్ణయించుకొన్నట్లు సమాచారం.