: రాజ్యసభలో లోక్ పాల్ బిల్లు ఆమోదం ప్రజా విజయం: అన్నా హజారే
రాజ్యసభలో లోక్ పాల్ బిల్లు ఆమోదం ప్రజా విజయమని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే అభిప్రాయపడ్డారు. లోక్ పాల్ బిల్లు ఆమోదం పొందడంతో ఆయన స్వస్థలం రాలెగావ్ సిద్ధిలో పండుగ వాతావరణం నెలకొంది. గత వారం రోజులుగా దీక్షలో కూర్చున్న అన్నాహజారే లోక్ పాల్ బిల్లు ఆమోదం పొందడంతో హర్షం వ్యక్తం చేశారు. ఆయన మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. లోక్ సభలోనూ బిల్లు ఆమోదం పొందుతుందని అన్నా ఆశాభావం వ్యక్తం చేశారు.