: ఓటరు నమోదు ప్రక్రియ 23 వరకు పొడిగింపు: భన్వర్ లాల్
హైదరాబాదు మహానగర ఓటర్లకు శుభవార్త. ఓటరుగా నమోదు చేసుకునేందుకు గడువును 23వ తేదీ వరకు పొడిగించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇవాళ్టితో ముగియనున్న ఓటరు నమోదు ప్రక్రియను మరో ఆరు రోజుల పాటు పొడిగించామని ఈసీ భన్వర్ లాల్ తెలిపారు. ఇప్పటికే నగరంలో ఓటుహక్కు కలిగి ఉన్న ఓటర్లు తమ పేర్లు, చిరునామాలో సవరణలను కూడా చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఓటర్ల తుది జాబితాను జనవరి నెలలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు.