: అవిశ్వాసం కాదు.. ప్రజా సమస్యల పరిష్కారానికి గళమెత్తండి: మంత్రి డొక్కా
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి తీరాల్సిందేనని విపక్షాలు చేస్తున్న డిమాండుపై మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఘాటుగా స్పందించారు. ''చట్టసభల్లో ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు, సర్కారు వైఫల్యాలను ఎండగట్టేందుకు విపక్షాలు పోరాడాలి. కానీ, వాటిపై ధ్యాసలేని ప్రతిపక్షాలు చీటికీమాటికీ అవిశ్వాస మంటూ బెదిరింపులు చేస్తున్నాయి'' అని మంత్రి గుంటూరులో అన్నారు.
పార్టీల మధ్య ఐక్యత, మంచి వాతావరణం లేకనే ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆరు నెలల కిందటే ప్రభుత్వం తన బలాన్నిఅసెంబ్లీలో నిరూపించుకుందని డొక్కా ఈ సందర్భంగా గుర్తు చేశారు.
పార్టీల మధ్య ఐక్యత, మంచి వాతావరణం లేకనే ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆరు నెలల కిందటే ప్రభుత్వం తన బలాన్నిఅసెంబ్లీలో నిరూపించుకుందని డొక్కా ఈ సందర్భంగా గుర్తు చేశారు.