: మీ బోధనలు రాహుల్ కు చేయండి.. మాకు కాదు:పయ్యావుల
ముసాయిదా బిల్లును చించడంపై దిగ్విజయ్ సింగ్ చేసిన వాఖ్యలకు పయ్యావుల కేశవ్ దీటుగా జవాబిచ్చారు. ముందు మీ యువనేతకు బుద్ధులు చెప్పండని హితవు పలికారు. లోక్ పాల్ ఆర్డినెన్స్ ప్రతులను రాహుల్ గాంధీ చించిపడేశాడు గుర్తు లేదా? అని ఎద్దేవా చేశారు. మాకు మీరు హితబోధ చేసే స్థితిలో లేరని.. అలాగే మీ బోధనలు వినే స్థితిలో కూడా ఇక్కడ ఎవరూ లేరని మండిపడ్డారు. మిమ్మిల్ని మీ రాష్ట్ర ప్రజలే తిరస్కరించారన్న విషయం గుర్తుంచుకోండని హితవు పలికారు. ప్రజలు తిరస్కరించిన మీరు మాకు సూచించే పరిస్థితిలో లేరని గుర్తించండి అని సూచించారు.