: అక్కడ అబ్బాయి-ఇక్కడ అమ్మాయిని..ఫేస్ బుక్ కలిపింది..!
బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతోన్న సౌదీ అరేబియాలోని ప్రవాస భారతీయుడి ఆచూకీని ఫేస్ బుక్ సహాయంతో కనుగొన్నారు. ట్యూమర్ కారణంగా తీవ్రమైన మతిమరుపుతో అతను.. జెడ్డా సిటీలోని భారతీయ రాయబార కార్యాలయం వద్ద స్పృహ కోల్పోయి పడి ఉన్నాడు. అతని పేరేంటో, ఊరేంటో, ఏం పని చేస్తున్నాడో భారత రాయబార అధికారులకు అంతుచిక్కలేదు. చికిత్స నిమిత్తం అతడిని అక్టోబర్ నెలలో ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స జరుగుతోంది కానీ.. తనకు సౌదీలో ఉద్యోగం ఎవరిచ్చారో, తన పాస్ పోర్టు వివరాలేంటో అతడు అధికారులకు చెప్పలేకపోయాడు. అతనొక తమిళుడు అన్న విషయం తప్ప మిగతా వివరాలేవీ తెలియక.. అధికారులు తలపట్టుకు కూర్చున్నారు.
భారత రాయబార కార్యాలయ వర్గాలు అతని ఫోటోతో కొన్ని తమిళ సంస్థలను సంప్రదించాయి. ఈ క్రమంలో ఓ తమిళ సంస్థ బాధితుడి ఆచూకీ చెప్పాలంటూ ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. దాదాపు ఎనిమిది వేల మంది అతడి ఫోటోను షేర్ చేశారు. చివరకు ఓ వ్యక్తి అతడిని గుర్తుపట్టి వివరాలను అధికారులకు అందించాడు. తమిళనాడులోని విల్లిపురానికి చెందిన దనిగైవేల్ గుణశేఖరన్ అని చెప్పడంతో, విల్లిపురంలోని అతని భార్యకు విషయం చేరవేశారు. శేఖరన్ భార్య చెన్నై అధికారుల సహాయంతో పాస్ పోర్టు, వీసా కాపీలను భారత రాయబార వర్గాలకు అందించింది. అతడి చికిత్స ఖర్చులను భారత రాయభార కార్యాలయ వర్గాలే చెల్లించాయి. ఎట్టకేలకు.. గుణశేఖరన్ ను చెన్నైలోని విల్లిపురానికి పంపించేందుకు అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చే్స్తున్నారు.