: సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు ఇది తగదు: గండ్ర
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు సభను అడ్డుకోవడం సమంజసం కాదని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, శాసనసభ సజావుగా నడిపేందుకు అవకాశాన్ని కల్పించాలని కోరారు. తెలంగాణ ముసాయిదా బిల్లు చర్చ సందర్భంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గండ్ర సభ్యులకు సూచించారు.