: బీఏసీ సమావేశంలో ఆసక్తికర చర్చ
టీ.బిల్లుపై చర్చ, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఈ రోజు జరిగిన బీఏసీ మీటింగ్ లో ఓ ఆసక్తికర చర్చ జరిగింది. ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, టీబిల్లుపై నిన్ననే చర్చను ప్రారంభించామని చెప్పారు. వెంటనే అందుకున్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ... చర్చ ప్రారంభమైందా? లేదా? అనే విషయం అర్థం కాకుండా ఉందని, దీనిపై క్లారిటీ ఇవ్వాలని అన్నారు. ఇంతలో మధ్యలో కలగజేసుకున్న ముఖ్యమంత్రి కిరణ్... 'జరిగిందేదో జరిగింది. దాని సంగతి వదిలేయండి' అంటూ ఫుల్ స్టాప్ పెట్టారు.