: ఢిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయంపై కేంద్రం ఆంక్షలు


అమెరికాలో భారత దౌత్య కార్యాలయం అధికారి దేవయాని ఖోబ్రాగాదెకు జరిగిన అవమానంపై భారత్ తీవ్రంగా మండిపడుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయంపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అమెరికా రాయబారులు, కాన్సులేట్లకు జారీ చేసిన అన్ని ఎయిర్ పోర్టు పాస్ లను భారత్ ఉపసంహరించుకుంది. న్యాయమార్గ్ లోని యూఎస్ రాయబార కార్యాలయం వద్ద ట్రాఫిక్ ఆంక్షలను ఎత్తివేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఇక ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో యూఎస్ మెంబర్ షిప్ తో వచ్చే వాహనాలకున్న ప్రత్యేక ప్రాధాన్యతను రద్దు చేసింది. దాంతో, ఇకపై సాధారణ వాహనాల్లాగే పార్కింగ్ స్థలంలో వారి వాహనాలను పార్క్ చేసి ఫీజు చెల్లించాలి. మద్యం సహా అమెరికా నుంచి అన్ని రకాల దిగుమతులను ఆపివేసింది. అటు అమెరికా కార్యాలయాల్లోని భారతీయ సిబ్బంది జీత భత్యాల వివరాలు తెలపాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరింది.

  • Loading...

More Telugu News