: ఏ ఆస్కార్ ను మనం గెల్చుకోలేము: నసీరుద్దీన్ షా
భారతీయ చిత్రాలు ఆస్కార్ స్థాయిలో ఆదరణ పొందలేకపోవడంపై, అవార్డు దక్కించుకోకపోవడంపై ప్రముఖ హిందీ నటుడు నసీరుద్దీన్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అకాడమీ అవార్డుకోసం భారత దర్శకుల ప్రయత్నం హాస్యాస్పదమన్నారు. ఎందుకంటే, ఎప్పటికీ మనం (భారత సినీ పరిశ్రమ)ఆస్కార్ అవార్డును గెల్చుకోలేమని చెప్పారు. ఎవరైతే దానిపై ఆశలు పెట్టుకున్నారో వాటిని మర్చిపోవాలని సూచించారు. ఎందుకంటే, అది జరగదని.. ఒకవేళ అవార్డుకోసం ఎదురుచూస్తుంటే.. ఇంద్రధనుస్సు కోసం పాకులాడటమే అవుతుందని షా వివరించారు.