: చర్చ జరగాలి.. సభ్యులందరికీ అవకాశం రావాలి: సీఎం కిరణ్
ఈ రోజు జరిగిన బీఏసీ సమావేశానికి సీఎం కిరణ్ హాజరయ్యారు. అయితే, సమావేశం జరిగినంత సేపు ఉండకుండా, తన అభిప్రాయాన్ని మాత్రమే చెప్పి బయటకు వచ్చేశారు. ఈ సందర్భంగా సభలో టీ.బిల్లుపై చర్చ జరగాలని, సభలోని సభ్యులందరికీ బిల్లుపై అభిప్రాయం చెప్పే అవకాశం ఉండాలని చెప్పిన ముఖ్యమంత్రి వెంటనే భేటీ నుంచి బయటకు వచ్చేశారు.