: బీఏసీ సమావేశం నుంచి గాలి వాకౌట్.. సీఎంపై ఫైర్


శాసనసభ బీఏసీ సమావేశం నుంచి టీడీపీ సభ్యుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు వాకౌట్ చేశారు. సమైక్య తీర్మానం చేసిన తర్వాతే సభలో చర్చ జరగాలని ముద్దుకృష్ణమ ఈ భేటీలో డిమాండ్ చేశారు. అంతేకాకుండా, అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాతే ఇప్పటి వరకు రాష్ట్రాలు ఏర్పడ్డాయని తెలిపారు. అయితే, ఆయన సూచనను బీఏసీ తిరస్కరించింది. దీనికి నిరసనగా ఆయన సమావేశం నుంచి వాకౌట్ చేశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం కిరణ్ సోనియా ఆజ్ఞలను శిరసావహిస్తున్నారని విమర్శించారు. ఈ రోజు వరకు బిల్లుపైన ఓటింగ్ నిర్వహిస్తామని సీఎం ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. సీఎం రాష్ట్ర ప్రజలను 135 రోజులుగా మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను ముఖ్యమంత్రి కాంగ్రెస్ అధిష్ఠానం కాళ్ల ముందు పెట్టారని విమర్శించారు.

  • Loading...

More Telugu News