: క్యాంపాకోలా కేసుపై జనవరి 6న విచారణ: సుప్రీంకోర్టు
ముంబైలోని క్యాంపాకోలా ఫ్లాట్ యజమానులు దాఖలు చేసిన పిటిషన్ పై జనవరి 6వ తేదీన విచారణ చేపడుతున్నట్లు న్యూఢిల్లీలోని అత్యున్నత న్యాయస్థానం ఇవాళ ప్రకటించింది. భవన నిర్మాణ అనుమతులు ఉల్లంఘించి ప్లాన్ కు విరుద్ధంగా నిర్మించారంటూ క్యాంపాకోలాపై గతంలో సుప్రీంకోర్టులో కేసు నమోదైంది. కేసును విచారించిన న్యాయస్థానం యజమానులు వెంటనే ఫ్లాట్ లను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ‘సుప్రీం’ ఆదేశాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఫ్లాట్ యజమానులు పిటిషన్ వేశారు. ఆ పిటీషన్ పై వాదనలు జనవరి 6 నుంచి ప్రారంభం కానున్నాయి.