: చదువుకోవడానికి తగినంత సమయం ఇవ్వండి: యనమల
బిల్లును క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకు సభ్యులకు తగినంత సమయం కేటాయించాలని తెలుగుదేశం పార్టీ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఇప్పటికిప్పుడు సభలో బిల్లుపై చర్చను చేపట్టడం సరైంది కాదని అన్నారు. సభ్యులందరూ బిల్లులోని విషయాలను పూర్తిగా అర్థంచేసుకున్నప్పుడే చర్చ సంపూర్ణంగా జరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. బిల్లులోని ప్రతి క్లాజుపై చర్చ జరగాలని, అనంతరం ఓటింగ్ కూడా నిర్వహించాలని యనమల డిమాండ్ చేశారు. బిల్లు ముసాయిదాలోని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారి అభిప్రాయాలను స్వీకరిస్తామని చెప్పారు.