: రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొనే ఆ మాటలు: విజయలక్ష్మి
కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తామంటూ ఆంగ్లపత్రిక 'ఎకనామిక్ టైమ్స్' కు ఇచ్చిన ఇంటర్య్వూ విషయమై వైఎస్ఆర్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయ లక్ష్మి స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొనే ఇంటర్వ్యూలో ఆవిధంగా చెప్పినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో ఉండే ప్రభుత్వానికి బయటినుంచి మద్దతు పలుకుతామని తెలిపానని వివరించారు.
అయితే ఈ మాటలను ఎల్లో మీడియా వక్రీకరించి ప్రచారం చేస్తోందని విజయమ్మ మండిపడ్డారు. కేంద్రంలో ఎప్పుడు, ఏ పార్టీ అధికారంలో ఉంటుందో చెప్పగలమా? అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఆ పత్రిక మొదటి పేజీలో ఒకటి రాసి, రెండో పేజీలో తాను చెప్పింది రాశారని ఆమె వివరించారు. వార్త అంతా చదవకుండా కేవలం కొన్ని అంశాల ఆధారంగా తమపై ఇలా పుకార్లు పుట్టించడం సరి కాదని హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో అన్నారు.

- Loading...
More Telugu News
- Loading...