: ఉద్యోగశ్రీకి జనవరి నెల జీతాల నుంచి చందా వసూలు
రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, ఫించనుదారుల ప్రయోజనార్థం రాష్ట్రప్రభుత్వం ఉద్యోగశ్రీ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీంతో ఉద్యోగుల కుటుంబాలకు నగదు రహిత వైద్య సదుపాయం అందుబాటులోకి రానుంది. ఉద్యోగశ్రీకి సంబంధించి ఉద్యోగుల డిసెంబర్ వేతనాల నుంచి చందా వసూలు చేయాలని తొలుత భావించినా.. వేతనాల బిల్లుల తయారీ ప్రక్రియ ప్రారంభం కాలేదు. దాంతో ఉద్యోగులు, పెన్షనర్ల చందాను జనవరి వేతనాల నుంచి వసూలు చేయాలని నిర్ణయించినట్లు ఫించనుదారుల చర్చా వేదిక అధ్యక్షుడు వీరయ్య చౌదరి చెప్పారు.