: ఈ మధ్యాహ్నం రెండు గంటలకు ఏఏపీ ఎమ్మెల్యేల సమావేశం


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) 28 మంది ఎమ్మెల్యేలు ఈ మధ్యాహ్నం రెండు గంటలకు భేటీ కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఏఏపీ నేత, ఎమ్మెల్యే మనీశ్ సిసోడియా తెలిపారు. ఓ వైపు ఢిల్లీలో ఏఏపీ ప్రభుత్వ ఏర్పాటుకు తాము మద్దతిస్తామని కాంగ్రెస్ చెబుతుంటే, మరోవైపు ఏఏపీ పది రోజుల సమయం అడిగింది. ఈ నేపథ్యంలో, రాష్ట్రపతి పాలనకు లెఫ్టినెంట్ గవర్నర్ సిఫారసు చేశారు.

  • Loading...

More Telugu News